చర్లపల్లి, ఆగస్టు 3 : జర్నలిస్ట్‌ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నా రు. ఏఎస్‌రావునగర్ డివిజన్, టీఎస్ఐఐసీ కాలనీలో నూతనంగా నిర్మించిన కాప్రా ప్రెస్ క్లబ్ భవనాన్ని బుధవారం ఆ యన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్ట్‌ల సం క్షేమానికి తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రెస్‌క్లబ్ భవనానికి సహకరించిన దాతలు దేవరకొండ శ్రీనివాస్, జక్క రోషిరెడ్డి, వెంకటరత్నం, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి తదితరులను సన్మా నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్ రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, టీఆర్ఎస్ రాష్ట్ర నేత బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, కొత్త రామారావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కడియాల రమేశ్, శనిగరం అశోక్, నాయకులు సోమశేఖర్‌రెడ్డి, మర్రి మోహన్‌రెడ్డి, వీఎస్ బోస్, వెంకట్, ఏఎస్రావున గర్, చర్లపల్లి, కాప్రా టీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు కాసం మహిపా ల్‌రెడ్డి, డప్పు గిరిబాబు, సుడుగు మహేందర్‌రెడ్డి, సీసీఎస్ ప్రతినిధి ఎంపెల్లి పద్మారెడ్డి, ఎస్ఏ రహీం, వివిధ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అలాగే.. కాప్రా ప్రెస్ క్లబ్ భవనం ప్రారంభంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజు, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, జ్మోతిర్మా యిచారి, సహదేవ్చారి, సత్యనారాయణ, నర్సింహారెడ్డి, నాయకులు విద్యాసాగర్, నరేశ్గౌ డ్, బత్తుల శ్రీకాంత్‌యాదవ్, కనకరాజుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.