
సుల్తాన్‌బజార్, నవంబర్ 11 : దళితుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన జాతీయ మాలల ఐఖ్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఆవుల బాలనాథం మృతి దళిత జాతికి తీరని లోటని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య అన్నారు. గత శనివారం జేఎంఐవీ వ్యవస్థాపక అధ్యక్షులు బాలనాథం అనారోగ్యంతో మృతి చెందిన సందర్భంగా కోఠి పుత్లీబౌలిలోని బాలనాథం నివాసంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.