మలక్‌పేట, ఫిబ్రవరి 6 : వాహెద్‌నగర్, అఫ్జల్‌నగర్ కాలనీల్లో రహదారుల ప్యాచ్‌వర్క్ పనులు కొనసాగుతున్నాయి. గుంతలమయంగా ఉన్న రహదారులపై ప్రయాణాలు ఇబ్బందికరంగా మారవటంతో కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు షఫీ దృష్టికి తీసుకెళ్లారు. అతడు ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలకు తెలిపారు. ప్యాచ్‌వర్క్ పనులు పూర్తిచేయాలని ఎమ్మెల్యే ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అఫ్జల్‌నగర్ మినార్ మసీదు వద్దనుంచి వాహెద్‌నగర్, వెస్ట్ ప్రశాంత్‌నగర్, తీగలగూడ కాలనీల్లో ప్యాచ్‌వర్క్ పనులు చేపట్టారు. గుంతలను బీటీతో పూడ్చివేస్తూ కంబాక్టర్తో చదునుచేస్తున్నారు. వారం రోజుల్లో అన్నికాలనీల్లో పాచ్వర్క్ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.