బడంగ్‌పేట, ఫిబ్రవరి 5: పట్టపగలే ఓ ఇంట్లో దొంగలు పడి..భారీ మొత్తంలో సొత్తు దోచుకెళ్లారు. మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లెలగూడ న్యూ రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసముంటున్న భవానీ తన తల్లి యాదమ్మకు ఆరోగ్యం బాగలేకపోవడంతో గడ్డి అన్నారంలోని వైద్యశాలకు తీసుకెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది.. లోపలికి వెళ్లి చూడగా, బంగారం, నగదు కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.