
సుల్తాన్‌బజార్, నవంబర్ 11 : గోవులు పుట్టిన రోజుగా జరుపుకునే గోపాష్టమి వేడుకలను గురువారం వివిధ గోశాలలో ఘనంగా నిర్వహించారు. గురువారం శ్రీరామ్ జీవా సేవా సదన్ గోశాలలో గోపాష్టమి సందర్భంగా గోమాతలకు ప్రత్యేక పూజలు, తులాభారం,గోదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రస్టీ రిథేష్ జాగిర్దార్ తులాభారం దానం చేయగా వాలెంటీన్స్ లాబోరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పీఎస్ఆర్కె దుర్గా ప్రసాద్ 51 వేల రూపాయలను గోశాలకు దానం చేశారు.కార్యక్రమంలో గోశాల ప్రతినిధులు కమల్ కిశోర్, రాజేశ్ తపాడియా, సరోజ్ వివేకానంద, విక్రమ్ డాగా, లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ చైర్మన్ జస్మత్ పటేల్, మేనేజింగ్ ట్రస్టీ రిథేష్ జాగిర్దార్ పాల్గొన్నారు.