మాస్టర్ రోహన్, అరుణ్, బేబి ఖుషి నటిస్తున్న చిల్డ్రన్ మూవీ ‘సమ్మర్ హాలీడేస్’. శ్రీకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని తొలిగీతాన్ని బుధవారం విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు ఆదిత్య, నిర్మాత ఎస్కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసే చిత్రమిదని, పాటలన్నీ మెలోడీ ప్రధానంగా ఆకట్టుకుంటాయని దర్శకుడు తెలిపారు. ఈ కథ విన్నప్పుడే హార్ట్టచింగ్గా అనిపించిందని, కథానుగుణంగా సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉందని నిర్మాత ధీరజ్ మొగిలినేని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.