యశ్ కథానాయకుడిగా నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్’ ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకురానుంది. గీతూమోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో హీరో యశ్‌కు జోడీగా ఐదుగురు కథానాయికలు నటిస్తున్నారు. బుధవారం వారి పాత్రల్ని పరిచయం చేస్తూ చిత్రబృందం ప్రత్యేక వీడియోను పంచుకుంది. ఇందులో నయనతార బైక్‌పై స్టంట్స్ చేస్తూ యాక్షన్ మోడ్‌లో కనిపించింది. మెలిసాగా రుక్మిణి వసంత్ గన్‌తో కనిపించారు. ఇక నదియా పాత్రలో కియారా అద్వాణీ స్టన్నింగ్ గ్లామర్ లుక్స్‌తో ఆకట్టుకుంది.
రెబెకా పాత్రలో తారా సుతారియా సీక్రెట్ ఏజెంట్‌గా దర్శనమిచ్చింది. ఎలిజిబెత్‌గా హ్యుమా ఖురేషి పాత్ర సైతం శక్తివంతంగా అనిపించింది. ఈ వీడియోలో ‘ఒక్కొక్కరుగా వస్తారా..ఒకేసారి వస్తారా’ అంటూ యశ్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ ఐదుగురు నాయికలతో ఆయన పోరాటం ఉంటుందనే విషయం ఆ డైలాగ్‌తో అర్థమవుతున్నది. అయితే ఈ స్పెషల్ వీడియోలో అందాల ఆరబోతతో పాటు కొన్ని సంభాషణలు అభ్యంతరకరంగా ఉండటంతో సోషల్‌మీడియాలో ఈ వీడియోపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది.