
సుల్తాన్‌బజార్, నవంబర్ 11 : విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడిని జయిస్తే లక్ష్యం సలభమవుతుందని ఇందిరాప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వరలక్ష్మి అన్నారు. గురువారం నాంపల్లిలోని కళాశాలలో బీఏ, బీఎస్సీ విద్యార్థినులకు ఒత్తిడి, కోపం, ఎైక్జెటి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సెషన్లో భాగంగా ట్రైనర్, మెంటర్ డాక్టర్ ఎస్ బాలాజీ విద్యాబోధనలో ఎటువంటి ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి గాను విద్యార్థినులకు మెలకువలతో పాటు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కమిటీ కోఆర్డినేటర్ శ్రీదేవి, రమాప్రి, వందన, శాంతి పాల్గొన్నారు.