కేటీఆర్‌కు ఘన స్వాగతం
జయశంకర్ భూపాలపల్లిలోని కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన కు వచ్చిన కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్ పూర్ నియోజకవర్గకేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యతో కలిసి స్థానిక బీఆర్ఎస్ శ్రేణు లు ఘన స్వాగతం పలికారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : జయశంకర్ భూపాలపల్లిలోని కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన కు వచ్చిన కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్ పూర్ నియోజకవర్గకేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యతో కలిసి స్థానిక బీఆర్ఎస్ శ్రేణు లు ఘన స్వాగతం పలికారు. రాజయ్య కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. హనుమకొండ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కోమటిపల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కేటీఆర్‌కు శాలువా కప్పి సన్మానించారు.
అక్కడి నుంచి ఆత్మకూరు గూడెప్పాడ్ జంక్షన్‌కు చేరుకున్న కేటీఆర్‌కు ఆత్మకూరు, దామెర మండలాల బీఆర్ఎస్ నాయ కులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పరకాలలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్థానిక నేతలతో కలిసి స్వాగతించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లోని రింగ్ రోడ్డు వద్ద మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో స్థానిక నేతలు స్వాగతించారు.
జయశంకర్ భూ పాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద భూపాలపల్లి మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేవారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. రేగొండ మండల కేంద్రంలో ప్రా రంభమైన స్వాగత కార్యక్రమం గణపురం, గాంధీనగర్ జాతీయ రహదారి, కాటారం మం డల కేంద్రం, మహదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల్లో కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి పూలవర్షం కురిపిస్తూ.. భారీ గజమాలలతో ఘనంగా సతరించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

