సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ);సిగ్నళ్లు లేని జంక్షన్ల వద్ద ముందు ఎవరు వెళ్లాలి..? రైట్ ఆఫ్ వే హక్కు ఎవరికీ ఉంటుంది.. అసలు రైట్ ఆఫ్ వే అంటే ఏమిటీ..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా సైబరాబాద్ పోలీసులు రూపొందించిన ‘ రైట్ ఆఫ్ వే’ వీడియో ప్రయాణికులకు చక్కటి అవగాహన కల్పిస్తున్నది. దీనిని 50 లక్షల మంది వీక్షించడం విశేషం.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిపిన అధ్యయనంలో సిగ్నళ్లు లేని జంక్షన్ల వద్ద చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాలు అధికంగా ఉంటున్నట్లు తేలింది. ఆయా చోట్ల ముందుగా వెళ్లేందుకు ఎవరికీ హక్కు ఉందనేది చాలా మందికి తెలియకపోవడమే ప్రమాదాలకు కారణమవుతున్నట్లు తేల్చారు. మేమే ముందు వెళ్లాలని..ఎవరికీ వారే తొందర పడి.. వాహనాల వేగాన్ని పెంచేసి ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఉదాహరణకు ఓ వాహనదారుడు.. నాది ఖరీదైన కారు చాలా వేగంగా వెళ్తుంది.. నేనెందుకు నెమ్మదిగా వెళ్లాలి. ముందు వచ్చిన వాహనాన్ని దాటేస్తా’ నని ‘రైట్ ఆఫ్ వే’ను ఉల్లంఘిస్తున్నాడు. ఒక లారీ డ్రైవర్ ..నాది భారీ వాహనం.. ‘నన్ను ఎవరు వచ్చి ఢీకొట్టినా నాకేం కాదు.. ఎదుటి వాహనానికే నష్టం అంటూ నిర్లక్ష్యంగా రైట్ ఆఫ్ వేను అతిక్రమిస్తున్నాడు. నేను రోడ్డు దాటుతున్నాను.. కారు చాలా దూరంగా ఉంది.. ఒక వేళ వాహనదారుడు చూసినా.. ఆపేస్తాడనే భావనతో పాదచారుడు రోడ్డు దాటేస్తూ.. రైట్ ఆఫ్ వేను ఉల్లంఘిస్తున్నాడు. ఇలా ఎవరికీ వారు రైట్ ఆఫ్ వే ను పాటించకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
రైట్ ఆఫ్ వే అంటే…
50 లక్షలు మంది చూశారు…
ఈ ‘రైట్ ఆఫ్ వే’ గురించి అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రూపొందించిన వీడియోను వారం రోజుల్లోనే దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోను డౌన్లోడ్ చేసుకుని షేర్ చేయడం కూడా లక్షల్లో ఉంది. ఇలాంటి వీడియో రూపొందించినందుకు పలువురు పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
అత్యవసర వాహనాలకే..
రోడ్లపై అత్యవసర వాహనాలకు ఎప్పుడు రైట్ ఆఫ్ వే ఉంటుందని వాటికి అందరూ దారి ఇవ్వాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు పై అడ్డదిడ్డంగా వెళ్లకుండా ముందుగా ఎవరికీ హక్కు ఉందని తెలుసుకుని ఆ తర్వాత వెళ్తే.. ప్రమాదాలకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు.