
బన్సీలాల్‌పేట్, జనవరి 27 : కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ ద్వారా అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘ఈ-శ్రమ్’ పథకంలో ప్రతి కార్మికుడు నమోదు చేసుకోవాలని స్ట్రీట్ వెండర్స్ టౌన్ లెవెల్ కమిటీ సభ్యుడు జేమ్స్జాన్ అన్నారు. గురువారం పద్మారావునగర్‌లోని హమాలీబస్తీలో నేషనల్ అసోసియేషన్ ఫర్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా (నాస్వీ), అమెరికా ఇండియా ఫౌండేషన్ల సంయు క్త ఆధ్వర్యంలో బీజేపీ డివిజన్ కమిటీ సహకారంతో ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ప్రత్యేక నమోదు శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐఎఫ్ ప్రతినిధి అక్రమ్ మాట్లాడుతూ.. అసంఘటిత కార్మికులు మాత్రమే ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.