
సికింద్రాబాద్, జనవరి 27: బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం 11వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన పూలమాల వేసిన అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉద్యమ సమయంలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. విగ్రహం ఏర్పాటు వల్లే ఉద్యమకారులు ఉద్యమానికి నాంది పలికారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీరారెడ్డి, ప్రభుగుప్తా, విఠల్‌రావు యాదవ్, ప్రభుదాస్, నర్సింగ్‌రావు, మీనాభాస్కర్, ఇక్బా ల్, హాసీన్, ముక్తార్, రాజు, విజయ్, రమేశ్, అశోక్, శ్రీధర్, భాగ్య, జయ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నమెంట్ విజేత జట్టుకు ట్రోఫీ..
సికింద్రాబాద్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన రిపబ్లిక్ డే కప్-2022 క్రికెట్ టోర్నమెంట్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూ బోయిన్‌పల్లిలోని కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బోయిన్‌పల్లికి చెందిన జట్టు విజేతగా నిలిచింది. దీంతో గురువారం విజేత జట్టుకు మహేశ్వర్‌రెడ్డి ట్రోఫీని అందజేశారు.