
ఖైరతాబాద్, జనవరి 27: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి న తర్వాత ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యతనిచ్చిందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్డీకాపూల్‌లోని హోటల్ అబోడ్లో జరిగిన 46వ ఇస్టాలేషన్ నైట్ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు.
24 గంటల విద్యుత్ ఇస్తూ పవర్ హాలీడేస్ లేకుండా చేశారన్నారు. వ్యాపారులంతా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్రం టూరిజం హబ్‌గా విరాజిల్లనున్నదన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ వైశ్య యూత్ అధ్యక్షులు శేరి వెంకటేశ్, మాజీ అధ్యక్షులు నగేశ్ పాంపాటి, కొత్త రూపేష్, శ్రీనివాస్, శ్రీకాంత్ శేరి, చింతల అజయ్, వరుణ్ బొగ్గారపు, నరేశ్, విష్ణు, వినయ్, యాద నాగార్జున పాల్గొన్నారు.