
హయత్‌నగర్, జనవరి 27: వరుసగా చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 26 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి నగలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాచకొండ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలను వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా, రేవల్లె మండలం, గుడిపల్లి గ్రామానికి చెందిన కడిదెల సుధాకర్(27) సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో అనేక చోరీలకు పాల్పడి.. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. 26న మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్రాంత ఉద్యోగి ఇంటి తాళాలు పగులగొట్టి.. సొత్తు తస్కరించాడు. సుధాకర్‌ను పట్టుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.