
బంజారాహిల్స్, నవంబర్ 11:ఓఎల్ఎక్స్లో హెడ్‌ఫోన్ అమ్మేందుకు యత్నించిన ఓ మహిళను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.10లోని జహీరానగర్‌లో నివాసముంటున్న ఫరీదా ఖాన్ డిజిటల్ మార్కెటింగ్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తుంది.ఇటీవల ఫరీదాఖాన్ తనవద్దనున్న హెడ్‌ఫోన్స్‌ను విక్రయించేందుకు ఓఎల్ఎక్స్ వేదికగా ప్రకటన ఇచ్చింది. అది చూసిన సంతోష్ సింగ్ అనే వ్యక్తి ఫరీదాఖాన్‌కు ఫోన్ చేసి తాను హెడ్‌ఫోన్స్ కొంటానని, డబ్బులు చెల్లించేందుకు తాను పంపించే క్యూఆర్ కోడ్‌ను యాక్సెప్ట్ చేయాలని సూచించారు. అతడు చెప్పినట్లే క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా ఆమె అకౌంట్లోనుంచి పలు దఫాలుగా రూ.31వేలు మాయమయ్యా యి. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు సంతోష్సింగ్పై చీటింగ్ కేసు నమోదు చేశారు.