హైదరాబాద్ తడబ్యాటు ఆదుకున్న రాధేశ్, హిమతేజ
బంతితో రాణించినా కీలక సమయాల్లో బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ తడబడింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: బంతితో రాణించినా కీలక సమయాల్లో బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ తడబడింది. వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ రాధేశ్ (72), కొడిమెల హిమతేజ (46) నిలకడకు తోడు ఆఖర్లో అనికేత్ రెడ్డి (32) ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 275/9తో నిలిచింది.
తనయ్ త్యాగరాజన్ (29 బ్యాటింగ్), రక్షణ్ రెడ్డి (1 బ్యాటింగ్) ప్రత్యర్థికి ఆధిక్యాన్ని దక్కకుండా పోరాడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా 9 రన్స్ వెనుకబడి ఉంది. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో ధర్మేంద్రసిన్హ్ జడేజా (5/84) ఐదు వికెట్లతో మిలింద్ సేన వెన్ను విరిచాడు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 279/7తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన ఛత్తీస్‌గఢ్ ఐదు పరుగులు మాత్రమే జతచేసి 284కు ఆలౌట్ అయింది. మిలింద్ (3/19), రక్షణ్ రెడ్డి (3/37) చెరో మూడు వికెట్లు తీయగా అనికేత్ (2/59) రెండు వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

