హార్దిక్ పంజాబ్‌కు.. అర్ష్‌దీప్ ముంబైకి?
తమకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మను సారథిగా పక్కనబెట్టి గుజరాత్ టైటాన్స్ నుంచి ఏరికోరి తెచ్చుకున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పిన ముంబై.. మూడు సీజన్లకే అతడికి వదిలించుకునేందుకు సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
- ఐపీఎల్లో క్రేజీ ట్రేడ్! లివింగ్‌స్టన్‌పై కన్నేసిన చెన్నై
ఢిల్లీ: తమకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మను సారథిగా పక్కనబెట్టి గుజరాత్ టైటాన్స్ నుంచి ఏరికోరి తెచ్చుకున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పిన ముంబై.. మూడు సీజన్లకే అతడికి వదిలించుకునేందుకు సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. పాండ్యాను పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ చేసుకునేందుకు ఒప్పందం కుదిరినట్టు ఐపీఎల్ వర్గాల వినికిడి. అందుకు బదులుగా ముంబై.. పంజాబ్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కోరినట్టు సమాచారం. ఇదే విషయమై ఎంఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘రెండు వైపులా చర్చలు జరుగుతున్నాయి. డీల్‌ను విజయవంతం చేసేందుకు రెండు ఫ్రాంచైజీలు కృషి చేస్తున్నాయి’ అని చెప్పడం గమనార్హం.
పాండ్యాను తీసుకుని అర్ష్‌దీప్‌ను ఎంఐకి ఇచ్చేయడానికి ఒప్పందం కుదిరిందని, అధికారిక ప్రకటనే తరువాయి అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతుండటంతో ఈ గాసిప్స్‌కు మరింత బలం చేకూర్చినైట్టెంది. ఒకవేళ హార్ధిక్ పంజాబ్‌కు వెళ్లినా అక్కడ అతడు సాధారణ ప్లేయర్‌గానే సేవలందించాల్సి ఉంటుంది. ఇప్పటికే అక్కడ జట్టును విజయవంతంగా నడిపిస్తున్న శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ఈ బరోడా ఆల్‌రౌండర్ ఆడక తప్పదు. ఈ కోణంలోనూ కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ అయ్యర్, పంజాబ్ మేనేజ్మెంట్ చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. కాగా, హార్దిక్ కోసం పంజాబ్ అర్ష్‌దీప్‌ను వదులుకోనుండటమే (?) ఆశ్చర్యం కల్గిస్తున్నది.
చాలాకాలంగా అతడు కింగ్స్ ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. అయితే గత సీజన్ ఫస్టాఫ్‌లో అదరగొట్టిన కింగ్స్.. సెకండాఫ్‌లో బౌలింగ్ వైఫల్యంతో దెబ్బతింది. హార్దిక్ వస్తే పేస్ ఆల్‌రౌండర్ కూడా జట్టుకు దొరికినట్టవుతుందన్న భావనలో కింగ్స్ మేనేజ్మెంట్ ఉంది. అర్ష్‌దీప్ ట్రేడ్‌తో పాటు స్టోయినిస్, నెహాల్ వధేరానూ పంజాబ్ వేలానికి వదిలేయనున్నట్టు సమాచారం. ఇదిలాఉండగా సన్‌రైజర్స్ స్పిన్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్స్టన్ కూడా ట్రేడింగ్‌లోకి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అతడిని తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. లివింగ్స్టన్ కోసం లెఫ్టార్మ్ పేసర్ ఖలీద్‌ను ట్రేడ్ చేయాలనే యోచనలో సీఎస్కే ఉంది. అయితే నటరాజన్ రూపంలో ఎడమచేతి పేసర్ ఉండటంతో ఎస్ఆర్హెచ్ ఈ డీల్‌కు ఒప్పుకుంటుందా? అనేది అనుమానమే. ఆటగాళ్ల రిటెన్షన్‌కు ఆఖరి తేదీని ఈనెల 17గా నిర్ణయించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

