ఒక్క టిక్కెట్‌కు 247 మంది పోటీ
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఉమ్మడి ఆతిథ్యంలో జరిగే జరిగే వన్డే ప్రపంచకప్‌లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లకు భారీ డిమాండ్ నెలకొంది.
- భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ టిక్కెట్లకు మస్తు డిమాండ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఉమ్మడి ఆతిథ్యంలో జరిగే జరిగే వన్డే ప్రపంచకప్‌లో భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. 2027 అక్టోబర్ 10న జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరిగే ఈ హై వోల్టేజ్ పోరు కోసం ఐసీసీకి దాదాపు 84 లక్షల టిక్కెట్ దరఖాస్తులు వచ్చాయి. అయితే, ఈ మైదానం కేపాసిటీ 34 వేల సీట్లే కాగా.. ప్రతి టిక్కెట్‌కు ఏకంగా 247 మంది పోటీ పడుతున్నారు.
2027 నవంబర్ 21న ఇదే మైదానంలో జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ (79 లక్షల దరఖాస్తులు) కంటే కూడా లీగ్ దశలోని ఇండో-పాక్ పోరుకే అత్యధిక డిమాండ్ రావడం గమనార్హం. 14 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో ఆయా మ్యాచ్‌ల టిక్కెట్ల కోసం 193 దేశాల నుంచి ఐసీసీకి దాదాపు 12 కోట్లకు పైగా దరఖాస్తులు నమోదయ్యాయి. టిక్కెట్ల విండో నవంబర్ 21 వరకు అందుబాటులో ఉండనుండగా, అధిక డిమాండ్ ఉన్న మ్యాచ్‌లకు కంప్యూటరైజ్డ్ రాండమ్ లాటరీ ద్వారా టిక్కెట్లను కేటాయిస్తారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

