ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో తీవ్ర జాప్యం
రాష్ట్రంలోని వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియ తీవ్ర గందరగోళం మధ్య సాగుతున్నది.
- ఇంకా పెండింగ్‌లోనే లక్షల దరఖాస్తులు
- అధికారుల ఉదాసీనతపై గ్రాడ్యుయేట్ల అసంతృప్తి
- భారీగా నిలిచిపోయిన ఫారం-18 దరఖాస్తులు
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియ తీవ్ర గందరగోళం మధ్య సాగుతున్నది. ఓటర్ల నుంచి ఫారం-18 దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నప్పటికీ, వాటి పరిశీలన, ఆమోద ప్రక్రియలో యంత్రాంగం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నది. లక్షల దరఖాస్తులు ఇంకా వివిధ దశల్లో పెండింగ్‌లో ఉండటంతో అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంగళవారం సాయంత్రం 4.30 గంటల వరకు మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 4,31,210 దరఖాస్తులు రాగా, ఇందులో 70 వేలపైచిలుకు దరఖాస్తులు మాత్రమే ఆమోదం పొందాయి. అత్యధికంగా బూత్ లెవల్ అధికారుల (బీఎల్వోలు) స్థాయిలో 2,99,110 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏఈఆర్వోల వద్ద 16,274, ఈఆర్వోల వద్ద 4,161 దరఖాస్తులు పెండింగ్‌లో నిలిచిపోయాయి. మొత్తం మీద వేలాది దరఖాస్తులు ఇంకా ప్రాసెసింగ్‌కు నోచుకోకుండా మరుగునపడ్డాయి.
బీఎల్వోల స్థాయిలో పెద్ద సంఖ్యలో పెండింగ్
వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని 192 మండలాల నుంచి మొత్తం 5,15,582 దరఖాస్తులు అందగా, 1.53 లక్షలు మాత్రమే ఆమోదం పొందాయి. వీటిలో బీఎల్ స్థాయిలోనే ఏకంగా 2,76,709 దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. ఏఈఆర్వోల వద్ద 20,186, ఈఆర్వోల వద్ద 21,702 దరఖాస్తులు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ఒకవైపు తొలి విడత ఓటర్ల నమోదుకు 6వ తేదీతో గడువు ముగియనుండగా, మరోవైపు అందిన దరఖాస్తులను క్లియర్ చేయడంలో యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శించడంపై పట్టభద్రులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా వచ్చిన లక్షల దరఖాస్తులు కింది స్థాయిలోనే పెండింగ్‌లో ఉండటం వల్ల ఓటరు జాబితా పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

