హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): స్వదేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధించినట్టు సామాజిక, ఆర్థిక సర్వే పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రత్యేక ప్యాకేజీల కారణంగా 2014-15 సంవత్సరంతో పోలిస్తే, 2019-20 నాటికి పర్యాటకుల రాకలో 14.69 శాతం వృద్ధిరేటు నమోదైనట్టు వెల్లడించింది. కరోనా కారణంగా తరువాతి కాలంలో పర్యాటకుల సంఖ్య తగ్గినట్టు తెలిపింది.
పర్యాటకులను ఆకర్షిస్తున్న అంశాలు: రాష్ట్రంలోని చారిత్రాత్మక ప్రదేశాలు, సాంస్కృతిక సంపద, అద్భుత జలపాతాలు, కొండలు, ఆలయాలు.
ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నవి: వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, బెస్ట్ టూరిజం విలేజ్‌గా యూఎన్‌డబ్ల్యూటీవో) గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లి గ్రామం.
హైదరాబాద్ పాత్ర: దేశంలోనే ప్రధాన ఐటీ హబ్‌గా ఎదిగిన హైదరాబాద్.. ఎంఐసీఈ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్) వేదికగా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నది.
హైదరాబాద్‌లో ఏటా 20 అంతర్జాతీయ, 30 నుంచి 40 వరకు జాతీయస్థాయి కార్యక్రమాలు, వందల సంఖ్యలో జాతీయ సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్న కారణంగా హోటల్, ట్రావెల్స్, పర్యాటకానికి డిమాండ్ పెరిగింది.