Vegetables | ఆరోగ్యంగా ఉండాలంటే మందులను మింగడమే కాదు, పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యమే..
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మందులతోపాటు ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కూరగాయల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందించి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
Vegetables | ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మందులతోపాటు ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కూరగాయల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందించి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని కూరగాయలను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి వంటి అంశాలకు మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్‌ను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఉండే ఇండోల్స్, గ్లూకోసినోలేట్స్ వంటి సమ్మేళనాలు కాలేయం సహజంగా వ్యర్థాలను తొలగించడంలో తోడ్పడి, కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
బీట్రూట్, కాకరకాయ, పాలకూర..
రక్తపోటు ఉన్నవారికి బీట్రూట్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే సహజ నైట్రేట్లు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలను విస్తరించడంలో సహాయపడతాయి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడి రక్తపోటు నియంత్రణకు తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు కాకరకాయను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇందులో ఉండే పోలీపెప్టైడ్-పీ, కారంటిన్ వంటి సమ్మేళనాలు సహజ ఇన్సులిన్ మాదిరిగా పనిచేసి గ్లూకోజ్ నియంత్రణకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారికి పాలకూర మంచి ఎంపిక. ఇందులో ఐరన్‌తోపాటు ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇవి ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరం. పాలకూరతోపాటు నిమ్మరసం వంటి విటమిన్ సి అధికంగా ఉండే పదార్థాలను తీసుకుంటే ఐరన్ శోషణ మరింత మెరుగుపడుతుంది.
ముల్లంగి, క్యారెట్..
జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి ముల్లంగి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పీచుపదార్థం మలబద్ధకాన్ని తగ్గించి పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే పిత్తరసం విడుదలను ప్రోత్సహించడం ద్వారా కొవ్వు జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. కంటి ఆరోగ్యానికి క్యారెట్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎగా మారి కంటి చూపును కాపాడటంలో, కంటి ఉపరితలాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు క్యాప్సికమ్‌ను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఈ పోషకం తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు శరీరానికి సహాయపడుతుంది.
తోటకూర, ఉసిరి..
చర్మం కాంతివంతంగా ఉండేందుకు తోటకూర ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి చర్మానికి సహజమైన మెరుపును అందించడంలో తోడ్పడుతుంది. ఉసిరికాయను పోషకాహార నిపుణులు సూపర్‌ఫుడ్‌గా పేర్కొంటున్నారు. ఇందులో నారింజ రసం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా జుట్టు, గుండె ఆరోగ్యం, జీవక్రియకు కూడా మేలు చేస్తుంది. అయితే ఈ కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, ఇవి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కావని గుర్తుంచుకోవాలి. ఇప్పటికే ఏదైనా వ్యాధికి చికిత్స పొందుతున్నవారు వైద్యుల సూచనల మేరకు మందులు కొనసాగిస్తూ, సమతుల్య ఆహారంలో భాగంగా ఈ కూరగాయలను చేర్చుకోవడం ఉత్తమమని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

