హైదరాబాద్ 197 ఆలౌట్
కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో బరోడాతో ప్రారంభమైన రెండో మ్యాచ్లో హైదరాబాద్ 197 పరుగులకే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టులో జావేద్ అలీ (90 బంతుల్లో 65), తనయ్ త్యాగరాజన్ (51) మినహా మిగతా ఆటగాళ్లు మైదానంలో నిలబడకపోయారు. దీంతో 55.1 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటై తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఫదర్ షేట్ 5 వికెట్లతో హైదరాబాద్ను చావుదెబ్బ కొట్టగా.. లుక్మాన్ రెండు వికెట్లు, అభిమన్యు, భార్గవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన బరోడా ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ప్రత్యూష్ కుమార్ (30) టాప్ స్కోరర్గా నిలువగా.. హైదరాబాద్ బౌలర్ రవితేజ రెండు వికెట్లతో విజృంభించాడు. తొలి మ్యాచ్లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో బెంగాల్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

