నేను కళాకారున్ని. తెలంగాణ ఉద్యమంల గజ్జెకట్టి ఆడిపాడిన. తెలంగాణ వచ్చినంక సాంస్కృతిక సారథిల ఉద్యోగం కోసం ఈటల రాజేందర్ దగ్గరకు పోతే నమ్మించి మోసం చేసిండు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా.. అంబేద్కర్ కూడలి దగ్గర ఈటల కాళ్లు పట్టుకున్నా.. అయినా కనికరించలేదు. ఆయనకు ఈరోజు మేమెందుకు ఓటెయ్యాలె. నాలాంటి ఎందరో కళాకారులను మోసం చేసిన వ్యక్తి ఈటల రాజేందర్. రైతు చట్టాలను వ్యతిరేకించాల్సిందిపోయి బీజేపీలోనే చేరిన ద్రోహి ఈటల. నిరుద్యోగులారా ఇది అందరూ గుర్తుంచుకోండి.. టీఆర్ఎస్ అంటే నమ్మకం.. బీజేపీ అంటే అమ్మకం.. బీఎస్ఎన్ఎల్, రైల్వేలు ఇలా అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్నారు. అన్నీ ప్రైవేట్‌పరమైతే ఇక రిజర్వేషన్లు కూడా ఉండయ్.. ప్రభుత్వ ఉద్యోగాలే లేనప్పుడు రిజర్వేషన్లు ఎక్కడియ్. అందుకే బీజేపీనిగానీ, అందులో చేరిన ఈటలనుగానీ దగ్గరకు రానియ్యద్దు. నిరుపేద దళితులు బాగుపడతరని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుపైనా ఈటల విషంచిమ్ముతున్నడు. అందుకే ఆయనకు దళితులు, నిరుద్యోగులు, కళాకారులు ఎవ్వరూ ఓటెయ్యద్దు..
మోరే మధు, హుజూరాబాద్