హెచ్‌యూఎల్ లాభం 2,307 కోట్లు
- క్యూ4లో 4 శాతం పెరిగిన ప్రాఫిట్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: హెచ్‌యూఎల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,307 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,190 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం 5.34 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 10.21 శాతం పెరిగి రూ.12,220 కోట్ల నుంచి రూ.13,468 కోట్లకు చేరుకుంది.
50 వేల కోట్ల ఆదాయం
గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.50 వేల కోట్ల టర్నోవర్ సాధించింది సంస్థ. ఇలా ఒక్క ఏడాదిలో ఇంతటి స్థాయిలో ఆదాయం సాధించిన తొలి ఎఫ్ఎంసీజీ హెచ్‌యూఎల్ కావడం విశేషం. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.51,472 కోట్ల ఆదాయంపై రూ.8,892 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకున్నది.
ఆదాయంలో 11.25 శాతం వృద్ధిని కనబరుచగా, నికర లాభం 11.16 శాతం ఎగబాకింది. ఎబిటా మార్జిన్ 24.6 శాతంగా నమోదైంది. ఏడాది క్రితం రూ.9,667 కోట్లగా సంస్థ నిర్వహణ ఖర్చులు గత త్రైమాసికానికిగాను రూ.10,782 కోట్లకు పెరిగాయి. కంపెనీ షేరు ధర స్వల్పంగా తగ్గి రూ.2,144.25 వద్ద ముగిసింది.
‘ఇబ్బందికర పరిస్థితుల్లోనూ బిజినెస్ మోడల్‌తో నిలకడైన వృద్ధిని సాధించడం జరిగింది. నిరుడు రూ.50 వేల కోట్ల టర్నోవర్ సాధించిన తొలి సంస్థ మాదే. విక్రయాలు ఆశాజనకంగా ఉండటంతో ఆదాయంలో రెండంకెల వృద్ధి నమోదైంది.
– సంజీవ్ మెహతా, హెచ్‌యూఎల్ సీఈవో, ఎండీ
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- MD
- Sanjeev Mehta
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

