Yadagirigutta | కార్తీక మాసం.. ఆదివారం సెలవు.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు!
Yadagirigutta | కార్తీక మాసం.. అందులోనూ ఆదివారం సెలవుదినం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు.
Yadagirigutta | కార్తీక మాసం.. అందులోనూ ఆదివారం సెలవుదినం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. కొండపైకి వెళ్లే వాహనాలు సైతం బారులు తీరడంతో రద్దీ నెలకొంది.
కార్తీక మాసం కావడంతో భక్తులు స్వామివారి దర్శనంతో పాటు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. ఈ క్రమంలో సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో భక్తుల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న మండపాల్లో దీపారాధన చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
మరోవైపు కొండపైకి వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు అవసరాన్ని బట్టి వాహనాలను అనుమతిస్తున్నారు. క్యూలైన్లు, వ్రత మండపాలు, కొండపైన పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. ధర్మదర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

Yadagirigutta2
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yadagirigutta | కార్తీక మాసం.. ఆదివారం సెలవు.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు!
Allu Arjun | అల్లు అర్జున్ నుంచి ‘రాకా’, ‘AA23’ అప్డేట్స్ వస్తాయా .. అభిమానుల్లో భారీ అంచనాలు!
IND vs NZ | టాప్ ఆర్డర్ వైఫల్యం.. 209 పరుగులకే భారత్ ఆలౌట్!
Jawaharlal Nehru | మాజీ ప్రధాని నెహ్రూతో షర్మిలా, పటౌడీల చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న సోహా అలీ ఖాన్!
రూ.4.66 లక్షల జరిమానా కడితేనే స్వదేశానికి.. ఆరున్నరేళ్లుగా సౌదీలో చిక్కుకుపోయిన వేములవాడ వాసి!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

