రొయ్యలు: 250 గ్రాములు, మిరియాల పొడి: 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు : రెండు (తెల్లసొన), సోయాసాస్: ఒక టీస్పూన్, నూనె: వేపుడుకు తగినంత, వెల్లుల్లి: 8 రెబ్బలు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ: కప్పు, మక్కజొన్న పిండి: 2 టీస్పూన్లు, బ్రెడ్ క్రంబ్స్: 3 కప్పులు, ఉప్పూకారం: తగినంత.
బ్రెడ్ క్రంబ్స్ మినహా మిగతా పదార్థాలన్నీ ఫుడ్ ప్రాసెసర్‌లో వేసి ముద్దగా చేసుకోవాలి. ఇందాక మిక్సీ వేసిన మిశ్రమాన్ని చిన్నచిన్న ముద్దలుగా చేసుకుని బ్రెడ్ క్రంబ్స్‌లో దొర్లించి నూనెలో వేయించాలి. బంగారు రంగు వచ్చాక తీసేసి, సాస్‌తో సర్వ్ చేయాలి.