శ్రీకర్, అపూర్వ జంటగా దర్శకుడు హరికృష్ణ జినుకల స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘హౌస్ హజ్బెండ్’. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్‌ను తాజాగా హైదరాబాద్‌లో విడుదల చేశారు.
హీరో శ్రీకర్ మట్లాడుతూ…‘ ఇంటి పనులు చూసుకునే హౌస్ హస్బెండ్ కావాలని కోరుకున్న అమ్మాయికి ఎలాంటి సందర్భాలు ఎదురయ్యాయి అనేది కథాంశం. త్వరలో షూటింగ్ పూర్తి చేసి మీ ముందుకు తీసుకొస్తాం’ అన్నారు. దర్శక నిర్మాత హరికృష్ణ మాట్లాడుతూ..‘సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. కర్ణాటకలోని అడవుల్లో తొలి షెడ్యూల్ షూటింగ్ జరిపాం’ అని అన్నారు. గిరిబాబు, భానుచందర్, సుమన్, రఘుబాబు తదితరులు చిత్ర తారాగణం.