Sindhur | ఎల్లారెడ్డి రూరల్ : పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ కు మద్దతు పలుకుతూ హాట్సాఫ్ సింధూర్ అంటూ ఉపాధి హామీ కూలీలు తమ హర్షాన్ని ప్రకటించారు. ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు గ్రామంలో పనికి వచ్చిన ఉపాధి హామీ కూలీలు పహల్గాం దాడిలో మరణించిన భారతీయుల మృతికి గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమాయకులైన యాత్రికులపై పాకిస్తాన్ ఉగ్రమూకలు దాడి చేయడం సిగ్గుచేటన్నారు.
దీనికి ప్రతీకార చర్యగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల వారు హర్షం ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ కోట్లాది భారతీయులను ఆనందంలో ముంచివేసిందన్నారు. భారత్ జోలికి వస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గోనె శ్రీకాంత్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ భాగయ్య, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.