ప్రశాంత్ కార్తీ, మిస్తీ చక్రవర్తి, కార్తీక్ రాజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అను’. హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సందీప్ గోపిశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. తేజస్వి క్రియేటివ్ వర్క్స్ సంస్థ నిర్మించింది. హోలి సందర్భంగా ఈ సినిమాలోని ఏమైంది ఏమో లిరికల్ పాటను చిత్రబృందం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ..‘హార్రర్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమాలో భయపెట్టే అంశాలతో పాటు మంచి వినోదం కూడా ఉంటుంది. రంగుల పండగ హోలి సందర్భంగా ఏమైంది ఏమో లిరికల్ పాటను విడుదల చేశాం. పాట చాలా బాగుంటుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం’ అన్నారు. ఆమని, దేవి ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : ఘంటసాల విశ్వనాథ్.