Honda CB300F | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) దేశీయ మార్కెట్లో తొలి ఫ్లెక్సీ ఫ్యుయల్ మోటారు సైకిల్ ఆవిష్కరించింది. ‘సీబీ300 ఎఫ్ ఫ్లెక్సీ ఫ్యూయల్’ అనే పేరుతో వస్తున్న మోటారు సైకిల్. 300 సీసీ సెగ్మెంట్లో వస్తున్న తొలి ఫ్లెక్సీ ఫ్యూయల్ బైక్. దేశవ్యాప్తంగా బిగ్ వింగ్ డీలర్ల వద్ద ఈ మోటారు సైకిల్ లభిస్తుంది. హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఫ్లెక్సీ ఫ్యుయల్ మోటారు సైకిళ్లు తయారు చేయడం ఇదే మొదటి సారికాదు. ఇంతకుముందు బ్రెజిల్ లో 70 లక్షల ఫ్లెక్సీ ఫ్యుయల్ మోటారు సైకిళ్లు విక్రయించిందీ హోండా.
కానీ, భారత్ మార్కెట్లో టీవీఎస్ మోటార్ సైకిల్స్ మాత్రమే తొలి ఫ్లెక్సీ ఫ్యుయల్ బైక్ -‘టీవీఎస్ ఆర్టీఆర్ 200 ఎఫ్ఐ ఈ100’ ఆవిష్కరించింది. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఫ్లెక్సీ ఫ్యూయల్ లభ్యత కొరవడటంతో సేల్స్ చేపట్టలేదు. అలాగే హోండా తన సీబీ300ఎఫ్ ఫ్లెక్సీ ఫ్యూయల్ మోటారు సైకిల్ ఎప్పుడు డెలివరీ చేస్తామన్న సంగతి వెల్లడించలేదు.
హోండా సీబీ300 ఎఫ్ ఫ్లెక్సీ ఫ్యుయల్ మోటారు సైకిల్ 293.52సీసీ ఆయిల్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ పీజీఎం-ఎఫ్ఐ ఇంజిన్ తో వస్తుంది. ఈ85 (85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్) వేరియంట్ గరిష్టంగా 24.5 బీహెచ్పీ విద్యుత్, 25.9 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ గేర్ బాక్స్ విత్ అసిస్ట్ స్లీపర్ క్లచ్ తో వస్తోంది. ఈ మోటారు సైకిల్ డ్యుయల్ చానెల్ ఏబీఎస్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ తోపాటు ఫ్రంట్లో 276 ఎంఎం డిస్క్, రేర్ లో 220 ఎంఎం డిస్క్ బ్రేక్స్ కలిగి ఉంటుంది. ఇందులో గోల్డెన్ యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ రేర్ మోనో షాక్ ఉంటాయి. మెరుగైన దృశ్య గోచరత కోసం ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తోంది హోండా సీబీ300 ఎఫ్ ఫ్లెక్సీ ఫ్యుయల్ బైక్. స్పీడ్, ఓడో మీటర్, టాచో మీటర్, ఫ్యూయల్ గేజ్, ట్విన్ ట్రిప్ మీటర్స్, గేర్ పొజిషన్, క్లాస్ వంటి ఫీచర్లు ఉంటాయి.