హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో బాలిక అత్యాచార ఘటనలో నిందితులను కచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టంచేశారు. హోదాతో సంబంధంలేకుండా నిందితులను శిక్షించాలని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై మహమూద్ అలీ స్పందించారు.
ఇది దారుణమైన ఘటన అని మహమూద్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించబోమన్నారు. వారి నేపథ్యంతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీచేశామన్నారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు చెప్పారు.
Sure @KTRTRS sir. It is a ghastly incident. Strong action will be taken against all the offenders, irrespective of their background. @TelanganaDGP & @CPHydCity have already been directed to make out efforts & arrest all the accused at the earliest & take strong action as per law. https://t.co/6I7XbCPiUy
— Mohammed Mahmood Ali (@mahmoodalitrs) June 3, 2022