అమరావతి : విజయనగరం జిల్లాలోని జేఎన్టీయూ గురజాడ తొలి స్నాతకోత్సవాన్ని అదే జిల్లాలో నిర్వహించాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( YCP MLC Botsa) ఏపీ గవర్నర్ ( AP Governor ) కు లేఖ రాశారు. స్నాతకోత్సవాన్ని విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించడం వల్ల విజయనగరం జిల్లా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నిరసనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
ఈ నిర్ణయం వల్ల జిల్లా ప్రజల గౌరవం, ఆనందం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగర ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని కోరారు. విశాఖ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. విజయనగరం వంటి వెనుకబడిన జిల్లాలో విద్యాభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవాన్ని అదే జిల్లాలో నిర్వహించడం సముచితమని పేర్కొన్నారు.