e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home News భవిష్యత్‌ చిత్రం.. మహోన్నతం

భవిష్యత్‌ చిత్రం.. మహోన్నతం

  • వాహనాల సంఖ్యను 56.8% పెంచే లక్ష్యం
  • వాహన వేగం సైతం 35.8 కి.మీ. (గంటకు)
  • ఉమ్టాతో కలిసి ప్రతిపాదనలు రూపొందిస్తున్న హెచ్‌ఎండీఏ

ప్రస్తుతం నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లు, మెట్రో లాంటి వాహనాలు 32 శాతం ఉండగా 2041 నాటికి వీటి సంఖ్యను 56.8 శాతంగా పెంచాలని హెచ్‌ఎండీఏ ( హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) లక్ష్యంగా పెట్టుకున్నది. అంతేకాక వాహనాల వేగాన్ని సైతం 18.9 కిలోమీటర్ల నుంచి (గంటకు) 35.8 కిలోమీటర్లకు పెంచి పట్టణ ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది.

సిటీబ్యూరో, నవంబర్‌ 24 (నమస్తే తెలంగాణ): మెరుగైన పట్టణ ప్రజా రవాణా వ్యవస్థే లక్ష్యంగా హెచ్‌ఎండీఏ పని చేస్తోంది. వచ్చే 20 ఏండ్లలో వాహనాల సంఖ్యతో పాటు.. వాటి వేగాన్ని పెంచే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం నగరంలో వాహనాల శాతం 32 ఉండగా 2041 నాటికి 56.8 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అదేవిధంగా వాహనాల వేగం గంటకు 18.9 కిలోమీటర్ల నుంచి 35.8 కిలోమీటర్ల మేర పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణతో నగర ప్రజలు ట్రాఫిక్‌లోనే గంటల తరబడి తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అంతేకాక వాయుకాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. భవిష్యత్‌లో మరింత తీవ్రతరం కానున్న ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు హెచ్‌ఎండీఏ పట్టణ ప్రజా రవాణా వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్‌ ఎలా ఉంది? ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలను తెలుసుకునేందుకు హైదరాబాద్‌ యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(ఉమ్టా)తో కలిసి అధ్యయనం చేస్తున్నది. నివేదికలను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తున్నది.

- Advertisement -

మెరుగైన వృద్ధి..
దేశంలోని మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌ అన్నిరంగాల్లో మెరుగైన వృద్ధి నమోదు చేస్తున్నది. ఐటీ, రియల్‌, ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఏరోస్పేస్‌, లాజిస్టిక్‌ ఇలా అన్ని రంగాల్లో నగరం మెరుగైన పనితీరును కనబరుస్తోంది. దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతుండటంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది మంది నగరానికి వస్తుండగా భారీగా విస్తరిస్తోంది. ఇందుకనుగుణంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పని చేస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, కార్మికులు పనిచేసే చోటే నివాస ప్రాంతాలు ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టి రవాణా వ్యవస్థపై భారం తగ్గిస్తోంది. సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ఎన్‌ఎంటీ నెట్‌వర్క్‌ (నాన్‌ మోటరైజ్డ్‌ ట్రాన్స్‌పోర్టు-ైస్లెకింగ్‌ ట్రాక్స్‌)ను 450 కి.మీ మేర హెచ్‌ఎండీఏ పరిధిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సైకిళ్లపైనే రాకపోకలు సాగించేందుకు గుర్తించిన రోడ్లపై సైకిల్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌బండ్‌, కేబీఆర్‌ పార్కు చుట్టూ ప్రత్యేకంగా సైకిల్‌ ట్రాక్‌లను నిర్మించారు.

పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా..
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులతో పాటు రవాణా వ్యవస్థలను కల్పించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీతో పాటు ఔటర్‌ రింగురోడ్డు లోపల, బయట ఉన్న హైదరాబాద్‌ మెట్రో రీజియన్‌ పరిధిలోని ట్రాఫిక్‌పై సర్వే చేసే బాధ్యతను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించి వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇందుకనుగుణంగా వచ్చే 20 ఏండ్లలో ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్‌, లైట్‌ రైల్‌, మెట్రో నియో లాంటి రవాణా వ్యవస్థను జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి హెచ్‌ఎండీఏ వరకు విస్తరించాలని ప్రతిపాదనలు రూపొందించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement