HMD Vibe 2 Pro 5G : నోకియా కో కంపెనీ హెచ్ఎండీ బ్రాండ్ నుంచి వైబ్ 2 ప్రో పేరుతో 5జీ ఫోన్ భారతీయ మార్కెట్లోకి విడుదలైంది. ఇది 5జీ ఫోన్లలో ఎంట్రీ లెవెల్ ఫోన్. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. సిల్వర్ మిస్ట్, ఆక్వా గ్రీన్, కాస్మిక్ పర్పుల్ కలర్స్‌లో లభ్యం. లాంచింగ్ ఆఫర్ల కింద వివిధ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల కింద తక్కువ ధరలోనే ఈ ఫోన్ పొందొచ్చు.
ఈ ఫోన్లోని కీలక ఫీచర్లివి. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, రెండేళ్లపాటు ఓఎస్, సెక్యూరిటీ అప్డేట్స్, 64ఎంపీ సోనీ ఐఎంఎక్స్682 షూటర్ మెయిన్ కెమెరా+2ఎంపీ మ్యాక్రో కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ 64 రేటింగ్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లున్నాయి.
ఈ ఫోన్లో ఇండస్ ఏఐ మోడల్ కూడా ఉంది. ఇది ఇండియాలోని 22 భాషల్ని సపోర్ట్ చేస్తుంది. సంచార్ సాథీ యాప్ కూడా ప్రీలోడ్గా వస్తుంది. ధరలు సుమారు రూ.15,999, రూ.17,999. లాంఛింగ్ ఆఫర్ కింద రూ.1,000 అదనపు డిస్కౌంట్‌తో లభ్యం. ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.