ఉనా: కుటుంబాన్ని, మానవత్వాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని హిమాచల్ ప్రదేశ్ అఖిల భారతీయ సంత్ పరిషద్ ఇంఛార్జీ యతి సత్యాదేవానంద సరస్వతి తెలిపారు. దేశంలో ముస్లింల జనాభా పెరిగిందని, ఇది హిందువుల సంఖ్య తగ్గిందనడానికి నిదర్శనమన్నారు. హిందువులు తమ కుటుంబాల్ని బలోపేతం చేయాలని, తమ తమ కుటుంబాలను, మానవత్వాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టించాలని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ఉనాలో జరుగుతున్న సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమర్నాథ్, వైష్ణోదేవి యాత్రల సమయంలో హిందువులపై రాళ్ల దాడి జరిగేదని, దుర్గాష్టమి ఊరేగింపులోనూ దాడులు జరుగుతున్నాయని, హిందువులకు ఇంత కన్నా దురదృష్టకరమైంది ఏముంటుందని ఆయన అన్నారు.