న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసర్చ్(Hindenburg Research) సంస్థ ఇవాళ ఓ అర్థంకాని ట్వీట్‌ను పోస్టు చేసింది. ఇండియాలో మరో సంచలనం బయటపడనున్నట్లు ఆ ఎక్స్ పోస్టు ద్వారా హిండెన్‌బర్గ్ సంస్థ వెల్లడించింది. ఇటీవల అదానీ స్టాక్ మార్కెట్‌పై హిండెన్‌బర్గ్ రిలీజ్ చేసిన రిపోర్టుతో ఆ సంస్థ మార్కెట్ విలువ దారుణంగా పడిపోయింది.
అయితే ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో చేసిన పోస్టు.. భారత్ మరో సంచలనాన్ని నమోదు చేస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ చేసిన పోస్టు ఇప్పటికే అందర్నీ ఆకర్షిస్తున్నది. అదానీ అంశంలో ఆ సంస్థకు సెబీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూపు కొట్టివేసింది. కానీ తమ గ్రూపు కంపెనీలు సుమారు వంద బిలియన్ల డాలర్లు నష్టపోయినట్లు ఆ సంస్థ తెలిపింది.
Something big soon India
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024