హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు.. ఎనిమిది మంది మృతి
హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు | హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలకు ఆకస్మికంగా వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకొని ఎనిమిది మృతి చెందగా.. మరో ఎనిమిది

షిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలకు ఆకస్మికంగా వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకొని ఎనిమిది మృతి చెందగా.. మరో ఎనిమిది గల్లంతయ్యారు. కులు జిల్లాలో నలుగురు, లాహౌల్ – స్పితి జిల్లాలో ముగ్గురు, చంబా జిల్లాలో ఒకరు మృతి చెందారని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ సుదేష్కుమార్ మోక్త తెలిపారు. వర్షంతో లాహౌల్‌కు వెళ్లే రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. కులు జిల్లాలో 26 ఏళ్ల పూనమ్ అనే మహిళ, ఆమె నాలుగేళ్ల కుమారుడు ఉదయం పార్వతి నదికి ఉపనది అయిన బ్రహంగంగ నదిలో కొట్టుకుపోయారు. నదిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో.. వరదల్లో మరో ఇద్దరు కొట్టుకుపోయారు. లాహౌల్‌లోని ఉదయపూర్‌లో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో వచ్చిన వరదలకు ఇద్దరు కార్మికులతో పాటు ఓ ప్రైవేటు జేసీబీ కొట్టుకుపోయింది.
ఇద్దరు కూలీలు మృతి చెందగా.. మరో కొందరు కూలీల ఆచూకీ దొరకలేదు. వారిని వెతికేందుకు పోలీసులతో పాటు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బృందాలను పంపారు. నీటి ఉధృతి కారణంగా మంగళవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్‌కు ఆటంకం కలిగిందని సుదేష్ మోక్త తెలిపారు. బుధవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించగా.. కార్మికులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని కోరినట్లు లాహోల్-స్పితి డిప్యూటీ కమిషనర్ నీరజ్ కుమార్ తెలిపారు. కొండచరియలు విరిగిపడడంతో 60 వాహనాలు చిక్కుకుపోయాయని, చాలా ప్రాంతాల్లో రోడ్లు తిన్నాయి. సిమ్లా నగరంలోని వికాస్ నగర్లో కొండచరియలు విరిగిపడి కారుపై పడ్డాయి. మరో వైపు షిమ్లా వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
ఆ దేశాలకు వెళ్తే మూడేళ్ల నిషేధం.. పౌరులకు సౌదీ హెచ్చరిక
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
బ్రెజిల్లో ‘కొవాగ్జిన్’ అత్యవసర వినియోగ అనుమతి రద్దు!
Vaccine for children : కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్‌కు నిపుణుల కమిటీ సిఫారసు
Corona Reinfection : ముంబై వైద్యురాలికి 13 నెలల్లో.. మూడుసార్లు కరోనా పాజిటివ్
TS Polycet-2021 : పాలిసెట్ ఫలితాలు విడుదల
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

