హైదరాబాద్ : దేశ చరిత్రలో ఎన్నడు పెంచనంతగా వాణిజ్య సిలిండర్ల ( Gas Prices ) మీద రూ.993 పెంచిన ఘనత కేంద్రంలోని నరేంద్ర మోదీ ( Narendra Modi ) దేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) విమర్శించారు. ఎన్నికలు అయిపోగానే గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడం మోదీకి అలవాటేనని అన్నారు.
ఒక్క సిలిండర్ మీద దాదాపు రూ.1000 పెంచి సామాన్యులకు, హోటళ్లలో పని చేసే కార్మికులకు మోదీ మేడే కానుక ఇచ్చాడని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో నిన్నటి వరకు ఒక సిలిండర్ ధర రూ. 2,321 ల నుంచి రూ.3,315 పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటళ్లు, మెస్‌ల మీద ఆధారపడి చదువుకునే యువతకు, ఉద్యోగాలు చేసుకునే వారికి ఈ ధరల పెంపు వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. తక్షణమే పెంచి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.