తిరువనంతపురం: హిజాబ్ అంశం వివాదం కాదని, అదో కుట్ర అని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అభివర్ణించారు. కలీమాపై విశ్వాసం, నిర్ణీత సమయాల్లో నమాజ్ చేయడం, రంజాన్ పర్వదినాల్లో ఉపవాసం, లేనివారికి దానం చేయడం, హజ్ సందర్శన వంటి ఈ ఐదు అంశాలు మాత్రమే తప్పనిసరిగా పాటించాలని ఇస్లాంలో ఉన్నదని, హిజాబ్ ధారణ తప్పనిసరి అంటూ ఆ మతగ్రంథాలు పేర్కొనలేదన్నారు.