హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా రవాణాశాఖకు ఆదేశాలు రావడంతో 2016 ఏప్రిల్కు ముందు తయారైన వాహనాలకు కచ్చితంగా హైసెక్యూరిటీ నంబర్ప్లేట్లను బిగించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. సెప్టెంబర్ 30తర్వాత హై సెక్యూరిటీ (హెచ్ఎస్ఆర్పీ)నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేయడంతోపాటు యజమానిపై కేసులు నమోదు చేయనున్నట్టు అధికారులు హెచ్చరించారు.
కొత్త రవాణా చట్టం ప్రకారం హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుంటే పాత వాహనాలను విక్రయించడం సాధ్యం కాకపోవడంతోపాటు, రవాణాశాఖ, పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదవుతాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే బీమా, కాలుష్య ధ్రువపత్రాలు కూడా జారీ చేయబడవని వివరించారు. నంబర్ప్లేట్లకు సంబంధించి రవాణాశాఖ రూపొందించిన వెబ్సైట్ www.siam.in ఆధారంతో పొందవచ్చుని అధికారులు తెలిపారు. అలాగే ఆ వాహనాల రకాలను బట్టి నంబర్ ప్లేట్లకు కనిష్ఠంగా రూ.320, గరిష్ఠంగా రూ.800 వరకు చార్జీలను ఖరారు చేసినట్టు వెల్లడించారు.