గెజిట్ నోటిఫికేషన్ లేకుండా రిజిస్ట్రేషన్ల నిలిపివేత చెల్లదు
రిజిస్ట్రేషన్లను నిరాకరించాల్సిన భూములను నిషేధిత జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉంటుందని లేకుంటే ఆ భూముల రిజిస్ట్రేషన్లను నిరాకరించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
- నిషేధిత భూములపై హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): రిజిస్ట్రేషన్లను నిరాకరించాల్సిన భూములను నిషేధిత జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉంటుందని లేకుంటే ఆ భూముల రిజిస్ట్రేషన్లను నిరాకరించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం దేవాదాయశాఖ అధికారులు రాసిన లేఖల ఆధారంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేసే అధికారం రిజిస్ట్రార్లకు లేదని పేరొన్నది. వివరాల్లోకి వెళ్తే..
నల్లగొండ జిల్లా చింతపల్లి గ్రామంలోని 556, 557, 558, 585 సర్వే నంబర్లలోని భూముల రిజిస్ట్రేషన్‌ను నిరాకరించడాన్ని సవాలు చేస్తూ 2015లో దాఖలైన 4 పిటిషన్లపై జస్టిస్ యారా రేణుక విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వివాదాస్పద సర్వే నంబర్లలోని 18.31 ఎకరాల భూమికి ఆర్డీవో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీచేశారని, వారసత్వం ద్వారా హకులు బదిలీ అయ్యాయని, రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదయ్యాయని, పట్టాదారు పాస్‌బుక్‌లు, టైటిల్ డీడ్లు జారీఅయ్యాయని వివరించారు.
2006లో ఎన్వోసీ ద్వారా ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి 2013లో పిటిషనర్లు కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకోవడంతో అది గట్టుపతి వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూమి అంటూ దేవాదాయశాఖ అధికారులు లేఖ రాశారని, దాని ఆధారంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. కేవలం లేఖల ద్వారా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం సరికాదని, నిషేధిత జాబితాలో చేర్చకుండా రిజిస్ట్రేషన్లను నిరాకరించడం చెల్లదని స్పష్టం చేశారు. చట్టప్రకారం అన్ని ఆధారాలు ఉంటే రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. అవి ఆలయ భూములని భావిస్తే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం ద్వారా దేవాదాయశాఖ హకులను పొందవచ్చని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

