పిల్లల చిత్రాలకు స్ఫూర్తినిస్తుంది
చక్కటి కథాబలమున్న చిత్రాల్ని తెరకెక్కిస్తూ అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తాజా చిత్రం ‘సమ్మర్ హాలీడేస్' నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది.
చక్కటి కథాబలమున్న చిత్రాల్ని తెరకెక్కిస్తూ అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తాజా చిత్రం ‘సమ్మర్ హాలీడేస్’ నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ పిల్లల చిత్రంలో మాస్టర్ రోహన్, అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో నటించారు. శనివారం నిర్మాత ధీరజ్ మొగిలినేని విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఈ కథ విన్నప్పుడే తన మనసుకు హత్తుకుందని, తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ కథలోని పాత్రల్ని టీనేజ్‌లోకి మార్చి ఓ లవ్‌స్టోరీ తీయొచ్చు. కానీ బాల్యం తాలూకు ఆ ఇన్నోసెన్స్ పోతుంది. పాత్రల తాలూకు సున్నితత్వమే ఈ కథకు చాలా కీలకం’ అన్నారు.
ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే చిల్డ్రన్స్ సినిమాలు విరివిగా రావడానికి స్ఫూర్తినిస్తుందనే నమ్మకంతో ఈ సినిమా తీశామన్నారు. ఈ చిత్రంలో ఎలాంటి సందేశాలు ఉండవని, వేసవి సెలవుల్లో పిల్లలతో అమ్మమ్మ గడిపే జ్ఞాపకాలకు అందమైన దృశ్యరూపంలా సినిమా మెప్పిస్తుందని చెప్పారు. ఈ తరహా చిత్రాల్ని చాలా మంది చూస్తారని, ఎవరో ఒకరు ముందడుగు వేస్తేనే చిల్డ్రన్స్ మూవీస్ తీయడానికి నిర్మాతలు ముందుకొస్తారని ధీరజ్ మొగిలినేని చెప్పారు. తదుపరి సినిమాల గురించి చెబుతూ ‘సంగీత్ శోభన్‌తో తీస్తున్న ‘అంతా రాములోరు చూస్కుంటారు’ 80శాతం చిత్రీకరణ పూర్తయింది. అలాగే ‘35చిన్నకథ కాదు’ ఫేమ్ దర్శకుడు నందకిషోర్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. ‘కిష్కిందపురి’ దర్శకుడు కౌషిక్‌తో ఓ సినిమా చేయబోతున్నాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

