HCA : హైదరాబాద్ క్రికెట్ సంఘంలో జరిగిన అవకతవకలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి. హెచ్‌సీఏలో అక్రమాలపై సమగ్య దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించడమే అందుకు కారణం. హెచ్‌సీఏలో భారీగా నిధుల గోల్మాల్, ఇతర అక్రమాలపై సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్(Safilguda Cricket Club) ఫిర్యాదుపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పు వెలువరించారు.
హెచ్‌సీఏలో నిధుల గోల్మాల్, టికెట్ల అమ్మకంలో అక్రమాలు.. అవినీతిపై సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన హై కోర్టు దర్యాప్తునకు ఆదేశాలిచ్చింది. సీబీఐసీడీలోని సిట్‌తో దర్యాప్తు చేయాలని జస్టిస్ నగేశ్ భీమపాక ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు బృందానికి హెచ్‌సీఏ అధికారులు, సిబ్బంది సహకరించాలని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు జస్టిస్ నవీన్ రావు పర్యవేక్షణలో హెచ్‌సీఏ పనిచేయాలని జస్టిస్ నగేశ్ భీమపాక పేర్కొన్నారు.