GT vs RCB : చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్(100) శతకంతో గర్జించాడు. ఆర్సీబీ బౌలర్లను ఎడాపెడా ఉతికేసిన సాయి భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(32)తో కలిసి సెంచరీ భాగస్వా్మ్యంతో శుభారంభమిచ్చినా మిగతా బ్యాటర్లు అదే స్థాయిలో దంచలేకపోయారు. బట్లర్(25) మెరవగా.. ఆఖరి ఓవర్లో జేసన్ హోల్డర్(23 నాటౌట్) రెండు సిక్సర్లు, ఫోర్ బాదడంతో గుజరాత్ స్కోర్ రెండొందలు దాటింది.
టాస్ ఓడినా గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్(100), శుభ్‌మన్ గిల్(32) అదిరే ఆరంభమిచ్చారు. చిన్నస్వామిలో ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్నొన్న సాయి ఈ సీజన్లో రెండో అర్ధ శతకంతో మెరిశాడు. మరో ఎండ్‌లో గిల్ సైతం దంచేయగా.. 10 ఓవర్లకే గుజరాత్ స్కోర్ వంద దాటింది. ఈ జోడీని విడదీసేందుకు ప్రయత్నించి సఫలమయ్యాడు. 128 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే సెంచరీ హీరోను హేజిల్‌వుడ్ వెనక్కి పంపిగా గుజరాత్ స్కోర్ వేగానికి బ్రేకులు పడ్డాయి.
A touch of both class and power 👊
🎥 Jos Buttler and Washington Sundar sending the ball into the stands 🔥
Updates ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @gujarat_titans pic.twitter.com/4sdZF1dMsB
— IndianPremierLeague (@IPL) April 24, 2026
ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్(25) దంచేస్తాడనుకుంటే అతడిని భువనేశ్వర్ ఔట్ చేసి గుజరాత్‌కు షాకిచ్చాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్(19 నాటౌట్), జేసన్ హోల్డర్(23 నాటౌట్)లు చెలరేగారు. కృనాల్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హోల్డర్ 6, 6, 4తో గుజరాత్ స్కోర్ రెండొందలు దాటించాడు. సుదర్శన్ సెంచరీ, హోల్డర్ మెరుపులతో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అసలే చిన్న బౌండరీలుండే చిన్నస్వామిలో ఆర్సీబీ బ్యాటర్లు చెలరేగితే గుజరాత్‌కు మరో ఓటమి తప్పకపోవచ్చు.