ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన హిల్‌స్టేషన్ లంబసింగి నేపథ్యంలో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం ‘లంబసింగి’. ‘ఏ ప్యూర్ లవ్‌స్టోరీ’ ఉపశీర్షిక. భరత్, ‘బిగ్‌బాస్’ ఫేమ్ దివి జంటగా నటిస్తున్నారు. నవీన్‌గాంధీ దర్శకుడు. ఆనంద్ తన్నీరు నిర్మాత. ఈ సినిమాలో ‘నచ్చేసిందే నచ్చేసిందే..’ అనే తొలి గీతాన్ని ఆదివారం అగ్ర హీరో నాగార్జున విడుదల చేశారు. సిధ్‌శ్రీరామ్ ఆలపించిన ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్నందించారు. ఆర్.ఆర్.ధృవన్ స్వరకర్త. ‘నవ్వేసిందే నవ్వేసిందే..నా మనసే తవ్వేసిందే ఇలా..చిట్టి గుండె జారి మొట్టమొదటి సారి’ అంటూ చక్కటి ప్రేమభావాల్ని వ్యక్తీకరిస్తూ ఈ పాట సాగింది. ‘ప్రేమలోని గాఢతను తెలియజేసే గీతమిది. సిధ్‌శ్రీరామ్ గాత్రం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. సినిమా చిత్రీకరణ మొత్తం లంబసింగిలోనే జరిగింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, నిర్మాణం: కాన్సెప్ట్ ఫిల్మ్స్, సమర్పణ: కల్యాణ్‌కృష్ణ కురసాల, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: నవీన్‌గాంధీ.