Jagapathi Babu | దశాబ్దాలుగా క్లాసికల్ సినిమాలతో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు అలనాటి హీరోలు శ్రీకాంత్, జగపతిబాబు. ఈ ఇద్దరు యాక్టర్లకు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరు సీనియర్ యాక్టర్లు తమ తమ సినిమాలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు వచ్చారు. అయితే యాక్టింగ్ పరంగా మంచి మార్కులే పడ్డా ఈ సినిమాలు మాత్రం ప్లాప్ టాక్ మూటగట్టుకున్నాయి.
జగపతి బాబు నటించిన ‘వదలా’ సినిమాతోపాటు శ్రీకాంత్ నటించిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. సామాన్యుడి దురాశ, ఆ క్రమంలో సాగే ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది మిస్టర్ మిడిల్ క్లాస్. మధ్య వయస్కుడికి (మిడిల్ ఏజ్ మ్యాన్), యువతి చుట్టూ తిరిగే కథాంశంతో వచ్చింది ‘వదలా’.
సినిమా ప్లాట్స్‌ను గమనిస్తే.. రెండు సినిమాలు కూడా ఆసక్తికర కాన్సెప్ట్, ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్‌కు ఎక్కువ అవకాశం ఉన్నవే. వాటి ప్రోమోలు కూడా ప్రేక్షకుల అటెన్షన్‌ను తమ వైపుకు తిప్పుకునేలా ఉన్నాయి. అయితే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం ఏం చూపలేదు. కారణం ఈ రెండింటిలో బలమైన ఎగ్జిక్యూషన్ ఉండటమే. జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి యాక్టర్లు ఈ ఎగ్జిక్యూషన్లో ఉండటం వల్ల ప్రేక్షకులను మరింత నిరాశలోకి నెట్టేస్తుంది. సీనియర్ యాక్టర్లు కథలను ఎంచుకునే విషయంలో మరింత జాగ్రత్త వహించాలని, తాము చేసే ప్రాజెక్టులలో కొత్తదనం ఉండేలా చూసుకోవాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సినిమాలను డబ్బు కోసం కాకుండా ప్రేక్షకులు వారిని ఎలాంటి పాత్రల్లో చూడాలనుకుంటున్నారో.. వారి వయస్సు, ఇమేజ్‌కు తగ్గట్టుగా డిజైన్ చేసిన రోల్స్‌లో నటించడం మంచిదని మరికొందరు సూచిస్తున్నారు.
మొత్తానికి ఏదేమైనా శ్రీకాంత్, జగపతి బాబు ఇప్పటికైనా స్క్రిప్టుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుని ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సినిమాలు చేస్తే బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పెద్ద విషయమేమి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇద్దరు రాబోయే సినిమాలకు ఎలాంటి స్టోరీలు ఎంచుకుంటారనేది చూడాలి మరి.