Hema | సినీ నటి హేమ గతేడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాగా, ఆ ఘటన ఆమె వ్యక్తిగత జీవితానికి మాయని మచ్చలా మారింది. ఆ సమయం లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆమెపై తాత్కాలిక నిషేధం కూడా విధించింది. తరువాత బ్యాన్ ఎత్తివేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు, సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగా హేమ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండటం తెలిసిందే. ఇక తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హేమపై నమోదైన కేసును బెంగళూరు హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఈ శుభవార్తను హేమ భావోద్వేగంగా సోషల్ మీడియాలో పంచుకుంది. “నేను కేసు గెలిచాను… కానీ అమ్మను కోల్పోయాను” అంటూ హేమ పేర్కొంది.
హేమ మాట్లాడుతూ.. “ఇటీవల మా అమ్మ చనిపోవడం నా జీవితంలో పెద్ద దెబ్బ. ఆ బాధలోనే ఉన్నాను. ఇలాంటి టైమ్లో బెంగళూరు హైకోర్టు నా మీదున్న కేసును క్వాష్ చేసింది. నవంబర్ 3న జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ కాపీ వచ్చే వరకు చెప్పొద్దని అన్నారు. అందుకే ఆలస్యమైంది. ఈ గ్యాప్లో మా అమ్మకి స్ట్రోక్ వచ్చి చనిపోయింది మీడియా, సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల అమ్మ తీవ్ర మనస్తాపానికి గురైందని బాధపడ్డారు.ఫేక్ న్యూస్, ట్రోలింగ్ మా అమ్మను చంపాయి అంటూ హేమ తన బాధను వ్యక్తం చేసింది. అమ్మ నా స్ట్రెంత్… నా ధైర్యం. నాపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలను అమ్మ తట్టుకోలేకపోయింది. ఫేక్ న్యూస్, నిరాధార ఆరోపణలు, సోషల్ మీడియా ట్రోల్స్… ఇవన్నీ ఆమెను బాగా కృంగదీశాయి.
నేను ఫేక్ న్యూస్ ప్రచారం చేయోద్దని వేడుకున్నా వినలేదు. నన్ను రెగ్యులర్గా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. నేను నిర్దోషిని… ఏ తప్పూ చేయలేదు అని అన్నారు హేమ.
సింహం రెండు అడుగులు వెనక్కి వేస్తే పారిపోతున్నట్టు కాదు.. మళ్లీ దూకడానికి సిద్ధమవుతుంది. నేను కూడా అలానే నిలబడ్డాను. దేవుడు, అమ్మ దయతో నేను ఈ కేసు గెలిచాను. అయితే తాను కేసు గెలుచుకున్నా… తన అమ్మను ఎవరు తిరిగి తీసుకురాలేరని హేమ బాధతో చెప్పారు. ఒకవేళ సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్, న్యూస్ ఛానళ్లలో వేసిన ఫేక్ కథనాలు కారణంగా నేను చనిపోయి ఉండుంటే… ఈరోజు వచ్చిన తీర్పు నాకు ఉపయోగమా? నన్ను ఎవరు బతికిస్తారు? మనస్సాక్షి అనే పదాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఏడాదిన్నర నుంచి మానసికంగా, శారీరకంగా చాలానే బాధపడ్డామని వెల్లడించారు హేమ. ఈ వీడియోలో ఆమె పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు.తనపై వచ్చిన ఆరోపణలు, వాటి వల్ల తన అమ్మపై పడిన ప్రభావం, చివరకు తన అమ్మను కోల్పోవడం… ఇవన్నీ ఆమెను కుంగదీశాయి.