Bala Krishna | నటసింహం నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.. ఈ కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ తర్వాత వచ్చిన అఖండ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అదే కాంబినేషన్లో వస్తున్న సీక్వెల్ ‘అఖండ 2 తాండవం’ మార్కెట్లో సంచలన క్రేజ్‌ను సృష్టిస్తోంది.ఈ సినిమాపై బిజినెస్ సర్కిల్స్‌లో ఎంతటి డిమాండ్ ఉందో చెప్పడానికి ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్దే సరిపోతుంది. బాలయ్య కెరీర్లో ఇప్పటివరకు ఏ సినిమాకు రాని స్థాయిలో భారీ రేట్లు ఈ సినిమాకు పలికాయి.
ట్రేడ్ సర్కిల్స్ సమాచారం ప్రకారం, అఖండ 2 వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రైట్స్ 120 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచే 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా తో పాటు ఓవర్సీస్లో కూడా భారీ డిమాండ్ ఉంది. రైట్స్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతుంది. ఇంత భారీ రేటు పలకడానికి ప్రధాన కారణం బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌పై ఉన్న అఖండ నమ్మకం, అలాగే ‘అఖండ’ సినిమాతో ఏర్పడిన రికార్డు స్థాయి మాస్ క్రేజ్. బాలకృష్ణ కెరీర్లో ఇప్పటి వరకు హయ్యస్ట్ గ్రాస్ చేసిన సినిమా ‘అఖండ’. కరోనా తర్వాత విడుదలై కూడా ₹130 కోట్లు వసూలు చేసింది.
ఆ తరువాత వచ్చిన సినిమాలు 100 కోట్ల మార్క్‌ను దాటినా, 150 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ కావడం లేదు. ఇక ‘అఖండ 2’ విషయంలో మాత్రం ట్రేడ్ అనలిస్టులు భారీ అంచనాలతో ఉన్నారు.ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్లను దాటడంతో, మూవీ 150 కోట్లు కాకపోయినా, 200 కోట్ల వైపు దూసుకెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ టాక్. ‘అఖండ 2 తాండవం’ డిసెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. మాస్, ఫ్యామిలీ, యువ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న సినిమా కావడంతో మొదటి రోజు నుంచే ‘అఖండ’ స్థాయి కలెక్షన్లు వచ్చే అవకాశముందని ట్రేడ్ అంచనా. బాలయ్య–బోయపాటి కాంబినేషన్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద పాత హిస్టరీని రిపీట్ చేస్తుందా? లేక కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందా? అన్నదానిపై ఇప్పుడు పరిశ్రమ అంతా దృష్టి పెట్టింది.