Road Accident | ఏపీ శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని తుపాను వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేకువ జామున 3గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం దర్శనానికి వెళ్లి వెళ్తుండగా సమయంలో ప్రమాదం జరిగింది. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన సింగ్ పవార్ (630), విజయ్ సింగ్ తోమర్ (65), కుశాల్ సింగ్ (62), సంతోషిబాయి (62)గా గుర్తించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.