తిరుమల : శ్రీ శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశ గోవింద నామస్మరణతో తిరుమల ( Tirumala ) గిరులు భక్తులతో రద్దీగా మారాయి. వారాంతపు సెలవు దినం కారణంగా తరలివచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం ( Shilatoranam ) వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
శనివారం స్వామివారిని 90,546 మంది భక్తులు దర్శించుకోగా 36,303 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.93 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. 4.61 లక్షల లడ్డూలను విక్రయించగా 2.54 లక్షల మందికి అన్న ప్రసాదం అందించామని తెలిపారు.